![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -40లో.. మాణిక్యం పెట్టిన షరతుకి సీతాకాంత్ ఒప్పుకొని అదే విషయం శ్రీలతకి చెప్తాడు. ధన మన ఇంటికి ఇల్లరికం రావడానికి మాణిక్యం ఫ్యామిలీ ఒప్పుకున్నారంట కానీ ఆచారం ప్రకారం.. మనమే వాళ్ళింటికి సంబంధం మాట్లాడుకోవడానికి రావాలన్నారని శ్రీలతకి సీతాకాంత్ చెప్పగానే తను కోపంతో ఊగిపోతుంది. అసలు వాడేంటి వాడి స్థాయేంటి? మనం వెళ్లి మాట్లాడుకోవడం ఏంటని శ్రీలత కోప్పడుతుంది.
ఆ తర్వాత మనం వెళ్లే ప్రసక్తే లేదు కుదరితే నీ నిర్ణయం కూడా మార్చుకోమని శ్రీలత చెప్పి.. కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాణిక్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతు నా కొడుకు ఎక్కడ అంటు ఒక కలర్ లైట్స్ ముందు నిల్చొపెట్టి.. నీ జీవితం కూడా ఇలాగే ఉంటుందని మణిక్యం అంటాడు. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని రామలక్ష్మి అనుకుంటుంది. తాగి తాగి పిచ్చి లేచినట్లుందని సుజాత అంటుంది. ఏంటి నాన్న ఇంత దైర్యం గా ఉన్నాడని రామలక్ష్మి ఆలోచిస్తుంది. మరొకవైపు శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. రేపు మనం మాణిక్యం ఇంటికి వెళ్ళాలని అంటాడు. నేను రానని శ్రీలత చెప్తుంది. సిరి కడుపులో ఉన్న మా నాన్నని పొగట్టుకోలేను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్న రేపు నాతో వస్తున్నావని సీతాకంత్ చెప్పి వెళ్లిపోతాడు.
మరొకవైపు జాబిల్లి కోసం ఆకాశమళ్ళే వేచాను నీ రాకకై అనే సాంగ్ వింటు మాణిక్యం ఉంటాడు. రేపు వాళ్ళు వస్తారో రారోనన్న టెన్షన్ అసలు లేదని సుజాత అంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వస్తారని మాణిక్యం కాన్ఫిండెంట్ గా చెప్తుంటే.. ఎందుకు నాన్న అంత దైర్యంగా ఉన్నాడని రామలక్ష్మికి డౌట్ వస్తుంది. మరుసటిరోజు ఉదయం సీతాకాంత్, శ్రీలత, శ్రీవల్లి కలిసి మాణిక్యం ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |